Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

సంఘ సేవ - ఈశ్వర సేవ

ప్రతివ్యక్తీ తను కుటుంబానికి చేయవలసిన సేవచేస్తూనే శక్తివంచన లేకుండ సంఘసేవ చేయాలి. ఈశ్వరసేవలు కూడా ఆచరింపవలయును. నాడు ఛత్రపతి శివాజీ తపస్వీ అయిన సమర్ధరామదాసు అనుగ్రహంతో ఏవిధంగా థర్మపరిపాలన సాధించాడో, అదేవిధంగా నేడు కూడా ప్రజలు భగవధ్యాన తత్పరులై, దేశ##సేవకు పూనుకోవాలి. బాలురు చిన్నతనంలోనే ఈశ్వరభక్తిని, దేశభక్తిని అభ్యసించాలి. ప్రహ్లాదుడు కూడా తన మిత్రులకు సంఘసేవ, భగవద్భక్తి ఆవశ్యకతలను వివరించాడు. ¸°వనం వచ్చిన తర్వాత వాటిని ఆచరించవలెనంటే కామాది వ్యాధులవలనను కుటుంబభారం వలనను, అది సాధ్యముకాదు. పోనీ వార్థక్యం వచ్చినతర్వతానైనా అమలు చేద్దామంటే అప్పుడు శక్తిలేని కారణంగా నిర్లిప్తత ఏర్పడుతుంది.

భారతదేశ విభజన కారణంగా కోట్లాది హిందువులు స్థిరచరాస్థులు వదలి, భార్యాబిడ్డలతో వస్తున్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్దసంఖ్యలో కాందిశీకులు ఉండరు.

ఈ కాందిశీకులకు తమ దైవములైన శివ, రామ, కృష్ణులను వదిలితే అక్కడ సర్వసుఖాలు వారికి లభించి ఉండేవి; కాని వారు సర్వమూ త్యాగం చేసినా తమ దైవాన్ని ధర్మాన్ని వీడని కారణంచేతనే అన్నికష్టాలకు లోనౌతున్నారు.

తుదకు తమ ప్రాణాన్నికూడా త్యాగం చేసి వారు ధర్మరక్షణకు సిద్ధపడుతున్నారు. తమకు శక్తి లేకపోయినా వారు అనుసరించుచున్న ఆ త్యాగమే నిజమైన త్యాగము.

ఆ కాందిశీకులకు మనం ఏం చేస్తున్నాం అని మనలను మనం ప్రశ్నించుకొని కార్యోన్ముఖులం కావలెనని మనం గ్రహించాలి.

యువకులు స్కౌట్లు, హోంగార్డులు, ఎన్‌,సి,సి, దళసభ్యులు గానూ క్రమశిక్షణపొందడం అవసరము. ఐతే అందుకు భగవత్‌ చింతన కూడా జోడిస్తే అది వ్యక్తి శక్తిని తద్వారా లోకక్షేమాన్నికూడా ప్రసాదిస్తుంది.

భగవన్నామ మహిమను వివరిస్తూ సమర్థరామదాసు జపించిన ''శ్రీరామ జయరామ జయ జయరామ''అనే నామం ద్వారా భగవదనుగ్రహం పొంది శివాజీ దేశ క్షేమాన్ని సాధించాడనీ; అలాగే నేడుకూడా మనం మన కార్యక్రమాలలో ఏకాంతధ్యానాన్ని కూడా తప్పక నేర్చుకొనుట మంచిది, చిన్న వయస్సు నారికి సంఘసేవను, భగవద్భక్తినీ ప్రబోధిస్తున్న రాష్ట్రీయస్వయంసేవక సంఘములు నేడు దేశమును ఎంతైనా అవసరము.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page